Sunday, 20 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

పెన్షన్ల మంజూరులో జాప్యంపై డీఆర్డీఏ పీడీకి వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ నాయకులు

పెన్షన్ల మంజూరులో జాప్యంపై డీఆర్డీఏ పీడీకి  వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ నాయకులు
Share Short Clip Download PDF

నర్సంపేట నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఆసరా పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు శుక్రవారం వరంగల్ జిల్లా డీఆర్డీఏ కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, ఖానాపురం మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య ఆధ్వర్యంలో ఈ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు మాట్లాడుతూ...

నియోజకవర్గ వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న సుమారు 21 వేల మంది అర్హులకు ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్‌ను రూ.4,000లకు, వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000లకు పెంచాలని, బకాయి పడ్డ రూ.66,000లను వెంటనే విడుదల చేయాలని కోరారు.

గత బీఆర్ఎస్ హయాంలో దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి చొరవతో వేలాది మందికి పెన్షన్లు అందాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వల్లెపు శ్రీనివాస్, పులిగిల్ల యాదగిరి, బుస అశోక్ తదితరులు పాల్గొన్నారు.