బయట బీఆర్ఎస్, సభలో బీజేపీ గందరగోళం సృష్టిస్తూ సభా సమయాన్ని వృథా చేస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
బయట బీఆర్ఎస్ పార్టీ, సభ లోపల బీజేపీ గందరగోళం సృష్టిస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రెండు పార్టీలు సభా సమయాన్ని వృథా చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చలు జరిపి పరిష్కారాలు కనుగొనాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షాలు కుయుక్తులు పన్ని సభలో అలజడి సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే మూడు రోజులు వృథా అయ్యాయని, ప్రజా సమస్యల కంటే రాజకీయాలు చేసే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు.
సభా సమయాన్ని వృథా చేస్తున్న ప్రతిపక్షాలు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చర్చలకు సిద్ధం.. గందరగోళం
తగదు స్పీకర్పై జరిగిన అవమానంపై చర్చ జరపాలంటే బీఆర్ఎస్ ముందుకు రావడం లేదని విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. 22ఏ భూముల అంశంపై చర్చ జరపాలంటూ సభలో గందరగోళం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రతి ప్రజా సమస్యపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. అధికారిక కార్యక్రమాలకు అడ్డు తగలడం మానుకుని, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు సూచించారు.