తెలంగాణ అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అసెంబ్లీ ఎదుట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంతో పాటు, మహిళా ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి చీర లాగిన ఘటనలపై ప్రత్యేక విచారణకు ఆదేశించింది. విచారణాధికారిగా అడిషనల్ డీజీ విజయ్కుమార్ ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అసెంబ్లీ ఎదుట చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు, వాస్తవాలపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరిపి త్వరలోనే నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించంది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధుల ప్రవర్తన, భద్రతాపరమైన అంశాలపై అడిషనల్ డీజీ విజయ్ కుమార్ విచారించనున్నారు. ఈ దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.