పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను CEIR పోర్టల్ సహాయంతో నరసరావుపేట 1 టౌన్ పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. గుంటూరుకు చెందిన దవనం అరుణ్ కుమార్  తన రూ.30,000 విలువైన OPPO మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన శ్యామల ప్రదీప్  తన రూ.30,000 విలువైన OPPO మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నారు. అనకాపల్లి కి చెందిన కేతిరెడ్డి ఉష శ్రీ గారు తన రూ.35,000 విలువైన IQOO మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నారు. దీంతో వారు CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేశారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన గౌరవ పల్నాడు జిల్లా పోలీస్ అధికారి వారి ఆదేశాల మేరకు నరసరావుపేట 1 టౌన్ పోలీసు స్టేషన్ సీఐ శ్రీ ఫిరోజ్ గారు CEIR పోర్టల్ ద్వారా ఫోన్‌ను గుర్తించి రికవరీ చేశారు. అనంతరం రికవరీ చేసిన మొబైల్ ఫోన్‌ను బాధితులకు పోలీస్ స్టేషన్‌లో అందజేశారు. పోగొట్టుకున్న విలువైన ఫోన్‌ను తిరిగి పొందడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. CEIR పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగించి ఫోన్‌ను రికవరీ చేసిన నరసరావుపేట 1 టౌన్ పోలీసు స్టేషన్ సిఐ శ్రీ ఫిరోజ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నప్పుడు CEIR పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.