ఉద్యోగ బాధ్యతలను నిబద్ధతతో, అంకితభావంతో నిర్వర్తించినప్పుడే సహచరులు, అధికారులు, ప్రజల మన్ననలు పొందగలరని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు.

మంగళవారం పదవీ విరమణ పొందిన రాజేందర్‌కు ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో విజయలక్ష్మి మాట్లాడుతూ రాజేందర్ తన సర్వీస్ కాలంలో అప్పగించిన బాధ్యతలను అత్యంత నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. 42 సంవత్సరాలు సుదీర్ఘ కాలం విద్యాశాఖలో వివిధ హోదాల్లో నిర్వహించిన పదవులకు వన్నె తెచ్చారని అభినందించారు. ముఖ్యంగా గత రెండు సంవత్సరాల్లో విద్యా రంగానికి సంబంధించిన విధుల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, పదో తరగతి ఫలితాల మెరుగుదల, ఉపాధ్యాయుల పోస్టింగులు, బదిలీల ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఆయన పాత్ర అభినంద నీయమన్నారు.
క్లిష్టమైన సమస్యలు ఎదురైన సందర్భాల్లో కూడా ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా, సరైన నిర్ణయం తీసుకునే వరకు కృషి చేయడం రాజేందర్ ప్రత్యేకత అని తెలిపారు.
ఉద్యోగ బాధ్యతల్లో నిమగ్నమైన రాజేందర్‌కు కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ముఖ్యమని, ముఖ్యంగా ఆయన సతీమణి భాగ్యలక్ష్మి కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందించిన సహకారం అభినందనీయమన్నారు.
పదవీ విరమణ అనంతరం ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ, శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజయలక్ష్మి సూచించారు. కుటుంబ సభ్యులు ఆయనకు తగిన సమయం కేటాయిస్తూ, అన్ని విధాలా అండగా నిలవాలని కోరారు.
ఈ సందర్భంగా రాజేందర్, ఆయన సతీమణి భాగ్యలక్ష్మి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
పదవీ విరమణ పొందిన డీఈఓ
రాజేందర్ మాట్లాడుతూ తన సేవాకాలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర శాఖల అధికారులు అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ లలిత, సీపీఓ క్రిష్టయ్య, డిసిఎస్వో కిరణ్ కుమార్, స్పోర్ట్స్ అధికారి రఘు, డిపిఆర్వో శ్రీనివాసరావు,
ఎస్సి అభివృద్ధి అధికారి సుకీర్తి, మునిసిపల్ కమిషనర్ ఉదయ్, ఏఎంవో విజయపాల్ రెడ్డి, ఎంఈవో సేవా నాయక్, ఇతర మండలాల ఎంఈఓ లు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.