Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, ప్రజలకు మెరుగైన సేవ‌లు అందించాలి

రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, ప్రజలకు మెరుగైన సేవ‌లు అందించాలి
Share Short Clip Download PDF

సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ, హౌసింగ్ అంశాల‌పై ఉమ్మడి వ‌రంగ‌ల్‌జిల్లా స‌మావేశాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎంపి లు కడియం కావ్య, పోరిక బలరాం నాయక్,ఉమ్మడి జిల్లాలకు సంబందించిన శాసనసభ్యులతో క‌లిసి స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..

అధికారులు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవ‌లు అందించాల‌ని సూచించారు. మంచి పనితీరు కనబరిచే అధికారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, అక్రమాలకు పాల్పడే లేదా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకాడదని హెచ్చరించారు.

22ఏ నిషేధిత జాబితా, భూ సమస్యలు తదితర అంశాలపై అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సొంత‌ నిర్ణయాలు తీసుకోవద్దని మంత్రి గారు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదన్నారు.

అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రతి నెల కనీసం ఒకటి లేదా రెండుసార్లు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి తక్షణ పరిష్కారం చూపాలని సూచించారు.

ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంస్కరణ ప్రజలకు చేరేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

తెలంగాణ లోని ప్రతి మారు మూల ప్రాంతానికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న గ్రామాలు, వార్డుల్లోనే ఓట్లు అడుగుతాం ఇందిరమ్మ పరిపాలన కాలంలో రాష్ట్రం లో 25 లక్షల ఎకరాల భూములను పేదవారికి పంపిణీ చేసామన్నారు.

అంత‌కుముందు కేస‌ముద్రం మండ‌లంలోని నారాయ‌ణ‌పురం గ్రామంలో రైతుల‌కు ప‌ట్టాలు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్బంగా మంత్రిగారు మాట్లాడుతూ తెలంగాణ లోని ప్రతి మారు మూల ప్రాంతానికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామ‌న్నారు. ప్రభుత్వ ప‌ధ‌కాలను వివ‌రిస్తూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్న గ్రామాలు , వార్డుల్లోనే ఓట్లు అడుగుతామ‌న్నారు.

ఈరోజు 780 మంది రైతులకు భూ ఆధార్ పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేశామని నాలుగు రోజుల క్రితం తుంగతుర్తి లో 13 గ్రామాలకు చెందిన రైతులకు 3400 ఎకరాలకు పట్టాలను అందించాం భూభారతి తోనే ఇది సాధ్యమైందని రాష్ట్రంలో 125 సంవత్సరాల క్రితం చేసిన సర్వే మళ్లీ ఇప్పుడు చేస్తున్నామని ఈ సర్వే తో శాశ్వతంగా భూ సమస్యలు పరిష్కారం చేసి రాష్ట్రం లో కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుంద‌ని అన్నారు.

కేసముద్రం మండల కేంద్రంలో 1 కోటి 90 లక్షల వ్యయంతో నిర్మించిన 33/ 11, కె.వి. విద్యుత్ ఉప కేంద్రంను ప్రారంభించి ప్రాంగణంలో మొక్క నాటారు,మున్సిపల్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయలు ఇనుగుర్తి, దంతాలపల్లి, సిరోలు, నూతన భవనం నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, రాజ్య సభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎంపి పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే లు డాక్టర్ భూక్య మురళి నాయక్, కె.ఆర్ నాగరాజు , గండ్ర సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బానోతు సునీత, తదితరులు పాల్గొన్నారు.

అధికారులు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు  నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవ‌లు అందించాలి
అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, ప్రజలకు మెరుగైన సేవ‌లు అందించాలి