వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుళ్ళ కుమారస్వామి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు తుళ్ళ కుమారస్వామి , పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్ లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, వెయ్యి రోజులు గడిచిన ఇప్పటివరకు గ్యారెంటీలు, హామీలు నెరవేర్చకపోవడంతో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 8 రోజుల పాటు నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదో తేదీ వరకు వివిధ వినూత్న నిరసనలు చేపడుతాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మార్గం బిక్షపతి, మాజీ సర్పంచ్ గుజ్జ సంపత్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ లు గుజ్జ వీరన్న, సిలివేరు కుమారస్వామి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్య తిరుపతి నాయక్ నాయకులు బానోత్ నవీన్, సింగారబోయిన రాజశేఖర్, తుమ్మల శ్రీధర్, పూజారి రఘు, ఎండీ రహీం, మార్తా సారంగపాణి,కొండేటి సంపత్, ఎలికట్టే యాకయ్య, భూక్య రామన్న, భూక్య సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
త్వరలో పెద్ద ఎత్తున నిరసనలు: వర్ధన్నపేట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుళ్ళ కుమారస్వామి.