బీసీ ఆజాది ఫెడరేషన్ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులు పంజాల తిరుపతి గౌడ్ కుమారుని నిశ్చితార్థ వేడుక హనుమకొండలోని ఎర్రగట్టు గుట్ట సమీపంలోని మిత్ర ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికాల భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జినుకల లక్ష్మణరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకమరి శ్రీనివాస్ తదితర నాయకులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా పంజాల తిరుపతి గౌడ్ కుటుంబ సభ్యులకు నాయకులు తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న జంట సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు తదితరులు పాల్గొని నిశ్చితార్థ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పంజాల తిరుపతి గౌడ్ కుమారుని నిశ్చితార్థ వేడుక కు హాజరైన బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు