ములుగు జిల్లా సంక్షేమ భవనంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంచార జాతుల విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి. రామ్మోహన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి. రామ్మోహన్ మాట్లాడుతూ, సంచార జాతులు మరియు విముక్త జాతుల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. సంచార జాతుల ప్రజలు తమ పిల్లలను తప్పనిసరిగా విద్యావంతులను చేసి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, గౌరవం మరియు హక్కులు లభించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంచార జాతుల జిల్లా అధ్యక్షుడు బాణాల రాజుకుమార్, పూసల సంఘం జిల్లా అధ్యక్షుడు ముదురుకోళ్ల సదానందం, వీరభద్రీయ కుల సంఘం ములుగు మండల అధ్యక్షుడు బాణాల శంకర్, వీరభద్రీయ కుల సంఘం ములుగు మండల ప్రధాన కార్యదర్శి బాణాల నరేష్, వడ్డెర కుల సంఘం శ్రీను, గంగిరెద్దుల కుల సంఘం బిక్షపతి, పంబాల కుల సంఘం సభ్యులు దేవేందర్ మరియు బీసీ వెల్ఫేర్ శాఖ ఉద్యోగులు మొగిళి, సరిత, మానస, ప్రతాప్ , రత్నాకర్, కుమారస్వామి, నాలుగవ తరగతి ఉద్యోగులు మరియు విలేకరులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా సంక్షేమ భవనంలో సంచార జాతుల విమోచన దినోత్సవం