నిజామాబాద్(రైట్స్ మీడియా): జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధుల్లో ఉన్న మున్సిపల్ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుడు భూమయ్య 57వ డివిజన్ లో టాటా ఏస్ లోడర్ గా పనిచేస్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా ఆయనకు ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు. వెంటనే స్పందించిన సానిటరీ ఇన్స్పెక్టర్ జీవన్, సిబ్బంది ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఫిట్స్ వచ్చిన తర్వాత అతడికి గుండెపోటు రావడంతో మృతి చెందాడని తెలిపారు. దీంతో మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది.
విధుల్లో ఉన్న మున్సిపల్ కార్మికుడు గుండె పోటుతో మృతి... బల్దియాలో నెలకొన్న విషాద ఘటన