హుజురాబాద్ పట్టణం, మండల పరిధిలో వినాయక నిమజ్జనానికి నీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ద్వారా సంప్రదించి, కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరడం జరిగింది. దీనిపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ నిమజ్జనానికి అవసరమైన నీటిని కెనాల్ ద్వారా విడుదల చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. దీంతో వినాయక నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.