జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం (సెప్టెంబర్ 22) వివిధ గ్రామాల నుంచి రైతులు ఈ సీజన్‌కు సంబంధించిన ‘కొత్త పత్తి’ని విక్రయానికి తీసుకొచ్చారు. మార్కెట్‌కు కొత్త పత్తి రాక సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం ప్రత్యేక ముహూర్తం చేసి, కొబ్బరికాయ కొట్టి కొనుగోళ్లను లాంఛనంగా ప్రారంభించారు. తొలిసారిగా మార్కెట్‌కు పత్తి తీసుకొచ్చిన రైతులను శాలువాలతో ఘనంగా సత్కరించి, స్వీట్లు తినిపించారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ వేలంపాటలో కొత్త పత్తికి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,272, కనిష్టంగా రూ.7,011 ధర పలికింది. మురళీకృష్ణ ట్రేడర్స్, మల్లికార్జున ట్రేడర్స్ వారు ఈ పత్తిని కొనుగోలు చేశారు. మార్కెట్‌కు తొలి పత్తి తీసుకొచ్చిన వారిలో ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లికి చెందిన కలాల గణపతి రెడ్డి, పైండ్ల తిరుపతి రెడ్డి, అలాగే సిరిసేడు గ్రామానికి చెందిన బీనవేని కొమురయ్య తదితర రైతులు ఉన్నారు.