ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మామిడిగూడెం గ్రామంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రూ.15 లక్షల సీఐఆర్ నిధులతో ఏర్పాటు చేసిన కంటైనర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు ఏకరూప దుస్తులు, షూస్‌లను కలెక్టర్‌తో కలిసి పంపిణీ చేసి, వారితో కలిసి అల్పాహారం చేశారు.

అలాగే ఏటూరునాగారం మండలంలోని కొమరం భీమ్ నగర్ కాలనీలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.5 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కూడా మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు ఏకరూప దుస్తులు, షూస్‌లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాల్లో ఏటూరునాగారం అదనపు ఎస్పీ మనన్ భట్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, జిల్లా విద్యాశాఖాధికారి ఎ. సిద్ధార్థరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రఘు, ఉల్లాస్ సమన్వయకర్త కృష్ణబాబు, తహసిల్దార్, మండల విద్యాధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.