నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ కు సమీపంలో ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై .ఓమయ్య, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి. సుధాకర్ లు మాట్లాడుతూ నిజామాబాద్ జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 615 బెడ్ లకు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు.
నిజామాబాద్ జిల్లాతో పాటు నిర్మల్,కామారెడ్డి జగిత్యాల, మహారాష్ట్రలకు సంబంధించి అనారోగ్యాలకు గురైన ప్రజలు వస్తున్నారని కనీసం ప్రతిరోజు 2000 తగ్గకుండా అవుట్ పేషెంట్ ఉంటున్నారని తెలిపారు..రోజుకు 200 మంది ఇన్ పేషెంట్లు జాయిన్ అవుతున్నారని, కనీసం 1000 బెడ్లకు పెంచాలని ఏఐటీయూసీగా పోరాడుతుంటే గత రెండు సంవత్సరాల క్రితం 750 బిడ్డలకు (పడకలకు) అనుమతించారని కానీ బడ్జెట్ కేటాయించకపోవడంతో 615 బెడ్ లకు సంబంధించిన కార్మికులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తో పాటు నూతనంగా ప్రారంభమైన మాతా శిశు ఆసుపత్రిలో పనిచేస్తున్నారని అన్నారు.. దీని ద్వారా కార్మికులపై విపరీతమైన పని భారం పడి అనారోగ్యాలను పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే 750 బెడ్ లకు సంబంధించిన బడ్జెట్ను కేటాయించాలని, కార్మికులకు పని భారం తగ్గించాలని, పనిముట్లు ఇవ్వాలని లేని యెడల యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి ఫెరోజ్, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు స్వరూప, కవిత,భారతి, పవిత్ర, సాయి,వెంకటేష్ ,వంశీ తదితరులు పాల్గొన్నారు.