Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

గ్రామీణ ప్రజారోగ్యమే లక్ష్యంగా మెగా మెడికల్ క్యాంపులు: ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు

⏩సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా లింగంగుంట్ల ఏరియా ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

గ్రామీణ ప్రజారోగ్యమే లక్ష్యంగా మెగా మెడికల్ క్యాంపులు: ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు
Share Short Clip Download PDF

⏩13 విభాగాల నిపుణులతో ఉచిత పరీక్షలు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 3 నెలల ఉచిత మందులు

⏩త్వరలోనే ఆసుపత్రిలో ఖాళీల భర్తీ, అత్యాధునిక ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణం

నరసరావుపేట(రైట్స్ మీడియా): గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో, ప్రభుత్వ అధినేతగా 25 వసంతాల సుదీర్ఘ సేవలను పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “సేవా సంకల్ప్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా బుధవారం నరసరావుపేట లింగంగుంట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను కలెక్టర్, ఎమ్మెల్యే కలిసి ప్రారంభించారు. ముందుగా క్యాంపు వద్ద రోగుల పేర్ల నమోదు ప్రక్రియ, ల్యాబ్ సౌకర్యాలు, ఉచిత మందులు, యాంటీబయాటిక్స్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల నిల్వలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ..

ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆంకాలజీ, సైకియాట్రీ వంటి 13 విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు సేవలందిస్తున్నారని తెలిపారు. రక్త పరీక్షలు, బోన్ డెన్సిటీ, ఈసీజీ, కంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే నిరుపేదలకు 3 నెలలకు సరిపడా ఉచిత మందులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. తీవ్రమైన వ్యాధులు ఉన్న రోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉన్నత చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. లింగంగుంట్ల ఆసుపత్రిలో సేవల క్రమబద్ధీకరణలో భాగంగా ఇప్పటికే పాత ఆసుపత్రి నుంచి గైనకాలజీ వార్డును ఇక్కడికి తరలించామని, త్వరలోనే బ్లడ్ బ్యాంక్, మార్చురీలను కూడా మారుస్తామని తెలిపారు. పాత ఆసుపత్రి స్థలంలో గుంటూరు జీజీహెచ్ తరహాలో అత్యాధునిక 'ఎంసీహెచ్ బ్లాక్' నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు మారుమూల గ్రామీణ ప్రజలకు ఈ క్యాంపులపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ..

స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ..

పల్నాడు ముఖద్వారమైన నరసరావుపేటలో 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఏరియా ఆసుపత్రి ద్వారా ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సహకారంతో ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే ఆసుపత్రిలోని సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడంతో పాటు వచ్చే ఏడాది నాటికి ఎంసీహెచ్ బ్లాక్ మంజూరు కానుందని వివరించారు. వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది ఆసుపత్రిని తమ స్వంత సంస్థగా భావించి పేద రోగులకు అంకితభావంతో సేవలందించాలని కోరారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్ బాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రత్నమన్మోహన్, డీజీహెచ్ఎస్ ప్రసూన, ఆర్ఎంఓ ఏడుకొండలు, జిల్లా వ్యాక్సినేషన్ అధికారి హనుమకుమార్, వైద్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ..

Source / reference: Journalist Sk. Gouse, Palnadu.