పాలకుర్తి/జనగామ (రైట్స్ మీడియా): టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి బుధవారం సాయంత్రం దేవరుప్పుల మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి, పలువురు కుటుంబాలను పరామర్శించి, ఆర్ధిక సహాయలు చేశారు. ముందుగా ధర్మాపురం గ్రామంలో దండు సోమయ్య మృతిపట్ల సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ముత్యాల లక్ష్మి శస్త్రచికిత్స గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
దేవరుప్పుల మండలంలో పలువురు కుటుంబ సభ్యులకు ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆర్ధిక సహాయలు
తదుపరి దేవరుప్పులలో తోటకూరి వెంకన్న తల్లికి గుండె శస్త్రచికిత్స పరిస్థితిని తెలుసుకుని, కారుపోతుల విజయ్ తండ్రి మృతికి సంతాపం తెలిపారు. ఉప్పుల నాగరాజు భార్య మృతికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రెడ్డిరాజుల రమేష్ గారిని పరామర్శించి, బొజ్జం సుధీర్ తండ్రి మృతికి, భాషిపాక శోభన్ తల్లి మృతికి సంతాపం తెలిపారు. తదుపరి కామారెడ్డిగూడెంలో జిలకర కిషన్ భార్య మృతికి సంతాపం తెలిపిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి, అనంతరం చౌదూరులో మాజీ ఎంపీపీ ఇనుముల నర్సయ్య మృతికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి అండగా ఉంటామని ఝాన్సీ రాజేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు.