Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

పల్నాడు జిల్లాలో టీడీపీ హవా.. 18 జెడ్పీటీసీలు ఏకగ్రీవం!

విజయోత్సవ సంబరాల్లో తెలుగు తమ్ముళ్లు.. జెడ్పీ చైర్‌పర్సన్ రేసులో నల్లపాటి కీర్తన ముందంజ

పల్నాడు జిల్లాలో టీడీపీ హవా.. 18 జెడ్పీటీసీలు ఏకగ్రీవం!
Share Short Clip Download PDF

విజయోత్సవ సంబరాల్లో తెలుగు తమ్ముళ్లు.. జెడ్పీ చైర్‌పర్సన్ రేసులో నల్లపాటి కీర్తన ముందంజ

పల్నాడు జిల్లా(రైట్స్ మీడియా): పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతోంది. జిల్లాలోని 28 జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాగా, వాటిలో 18 స్థానాలను టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మిగిలిన 10 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా, తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవికి అభ్యర్థిగా ముందువరుసలో ఉన్న నల్లపాటి కీర్తన పెదకూరపాడు జెడ్పీటీసీగా తొలి అడుగులోనే ఏకగ్రీవంగా ఎన్నికై తన సత్తా చాటారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆశీస్సులతో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతుతో పెద్దకూరపాడు జడ్పిటిసి గా తొలి అడుగులోనే ఏకగ్రీవంగా ఎన్నికై విజయం సాధించారు

పల్నాడు జిల్లాలో టీడీపీ హవా.. 18 జెడ్పీటీసీలు ఏకగ్రీవం!

నల్లపాటి కుటుంబం నుంచి నాలుగో తరంగా ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లపాటి కీర్తనకు పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆమె జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి జిల్లాకు సేవలందించాలని ఆకాంక్షిస్తున్నారు.

Source / reference: Bureau Chief Sk. Gouse, Palnadu District, Andhra Pradesh.