పల్నాడు జిల్లా, రాజుపాలెం మండలం పెద్ద నెమలిపురి గ్రామంలో చోరీ జరిగింది. పెద్ద నెమలిపురి గ్రామంలో చోరీ ఘటన జరిగింది. తాళం వేసిన ఇంటిని దొంగలు టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. గ్రామంలోని కంగనంపాటి అరుణ (55) ఇంట్లో చోరీజరిగింది. ఈ చోరీ ఘటనలో 15 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదు అపహరణ గురి అయ్యాయి. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి దుండగులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తుంది. చోరీపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని సత్తెనపల్లి డీఎస్పీ కృష్ణ చైతన్య, సత్తనపల్లి రూరల్ సీఐ కిరణ్, రాజుపాలెం ఎస్సై మణికిష్ణ పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ పోలీస్ సిబ్బందితో కలిసి వివరాల సేకరించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.