నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాజేంద్ర చౌరస్తాకు సమీపంలోని ఓ థియేటర్​ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్​ సమీపంలో కూరగాయలు అమ్మే ప్రాంతానికి వచ్చి, అక్కడ హరిబాబు అనే వ్యక్తిని తమతో తెచ్చుకున్న కొబ్బరికాయలు కోసే కత్తితో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులతో సమాచారం తెలుసుకున్న రెండో టౌన్​ ఎస్ హెచ్ఓ యాదగిరి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించారు. ఏసీపీ ప్రకాశ్​ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. యూట్యూబర్​ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వైష్ణవి హత్య కక్ష్యలో భాగంగా హరిబాబును హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సమగ్ర విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..