ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశముల మేరకు,సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ బృందంగా ఏర్పడి, వైరాలోని పలు ప్రాంతముల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, అష్ణగుర్తి గ్రామంలో బలగాని నర్సింహారావు అనే బియ్యం వ్యాపారి ఒక పాడుబడిన ఇంట్లో పందొమ్మిది తెల్లటి ప్లాస్టిక్ సంచులలో (9-50 Qtls) రేషన్ బియ్యమును అక్రమంగా నిల్వ చేసినాడు. రేషన్ బియ్యం ను సీజ్ చేసి రేషన్ డీలర్‌కు తగు భద్రత నిమిత్తం అప్పగించి, బలగాని నరసింహారావు అనే అతనిపై 6A కేసు నమోదు చేయడం జరిగినది. ఈ బృందము కొణిజర్ల మండలములో పలు రేషన్ షాపుల నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇచ్చినందువలన, ఈ బృందం విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, రేషన్ డీలర్లు సక్రమంగా ఇస్తున్నారో లేదో పరిశీలించారు. ప్రతిరోజూ, బృందాలుగా ఏర్పడి, ఏదో ఒక మండలంలో తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తారు.