వర్ధన్నపేట మండలం చెన్నారం, రాయపర్తి మండలం కొండాపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ , ల్యాండ్ రికార్డ్స్ అదనపు సర్వే అధికారి ఎం శ్రీనివాసులు గురువారం రోజున క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే ప్రక్రియను పరిశీలించి, సర్వే పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూ సరిహద్దుల నిర్ధారణలో పూర్తి ఖచ్చితత్వం పాటిస్తూ, రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. భూ రీ-సర్వే పనులను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే ప్రక్రియను నిర్వహించాలని తెలిపారు. అనంతరం వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న నక్ష,ఆర్ ఓ ఆర్ పనులను క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ సర్వే తనిఖి చేశారు ఈ సర్వేలో రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.