GWMC(రైట్స్ మీడియా): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం అందించడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న అన్నారు.
సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి 81 దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత విభాగాలకు అప్పగించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిగణించాలని, సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికీ తావివ్వరాదని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజలకు అందించే ప్రతి సేవలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగం ఉండాలని సూచించారు.