తెలంగాణ సమాజానికి, తెలంగాణ మాండలికానికి కాళోజీ ఒక గొప్ప దార్శనిక, బహుభాషావేత్తగా ప్రసిద్దుడని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ అన్నారు. మంగళవారం నాడు ఇంటర్ విద్య కార్యాలయంలో కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత కాళోజీ చిత్రపటానికి పూలమాలతో, దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కాళోజీ ఒక గొప్ప దార్శనిక, బహుభాషావేత్త: జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్
వరంగల్ జిల్లా మాధ్యమిక విద్యాధికారి కార్యాలయంలో కాళోజి జయంతి, తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు.
ఈ సందర్భంగా డా.శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ..
కాలోజీ బహుభాషావేత్త అని చిన్నతనం నుండే తెలుగు చదివినప్పటికీ, మరాఠీ, కన్నడ, హిందీ మరియు ఉర్దూ భాషలలో కూడా కవితలు రాసారన్నారు. కాళోజీ రచనలు తెలంగాణ సమాజానికి ప్రేరణాదాయకం అని అన్నారు. "పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంగా దేశానిది" అనే మాట ఆయన దేశభక్తికి నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాళ్ళు భుజేందర్ రెడ్డి, సాజిత్, జనార్ధన్, కొమురారెడ్డి, కార్యాలయ సిబ్బంది శేఖర్, సందీప్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.