Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జాతీయం

టీవీకే పార్టీ నేతృత్వంలో అధికార కూటమికి కొత్త పేరు

టీవీకే కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ ఫ్రంట్’ గా నామకరణం చేశారు. తమ కూటమి అజెండా, లక్ష్యాలను స్పష్టంగా తెలిసేలా ఉందని మాణికం ఠాగూర్ అన్నారు.

టీవీకే పార్టీ నేతృత్వంలో అధికార కూటమికి కొత్త పేరు
Share Short Clip Download PDF

తమిళనాడు సీఎం విజయ్ పార్టీ టీవీకే నేతృత్వంలోని అధికార కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ ఫ్రంట్’గా నామకరణం చేశారు. టీవీకే మిత్రపక్షాలు చెన్నైలో పనైయూర్లో గల పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. రెండవ కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ ఫ్రంట్’గా నామకరణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, విడుతలై చిరుతైగల్ కట్చి (VCK), మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కళగం (MDMK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) వంటి కీలక భాగస్వామ్య పక్షాల నాయకులు హాజరయ్యారు.

అనంతరం టీఎన్సీసీ చీఫ్ మాణికం ఠాగూర్ మాట్లాడుతూ..

టీవీకే అధ్యక్షుడు, సీఎం విజయ్ నాయకత్వంలో కొత్త కూటమి ఏర్పాటైనట్లు వెల్లడించారు. ఈ కొత్త పేరు తమ కూటమి లక్ష్యాలను, ఆశయాలను స్పష్టంగా తెలియజేస్తోందని మాణికం ఠాగూర్ అన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడే పార్టీలన్నీ ఇందులో భాగమేనని అన్నారు. ఉప ఎన్నికల్లో తమ కూటమి పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.