ఢిల్లీ(రైట్స్ మీడియా): న్యూఢిల్లీలో జరుగుతున్న సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ (SRS ఇండియా-2026) అంతర్జాతీయ సదస్సులో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వర్చువల్ గా ప్రసంగించారు. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలతో పాటు సర్జికల్ రోబోటిక్స్ లో భారత్ వేగంగా దూసుకుపోతోందని ఆయన తెలిపారు.
న్యూఢిల్లీ వేదికగా అక్టోబర్ 2 నుంచి 4 వరకు జరుగుతున్న సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ (SRS ఇండియా-2026) అంతర్జాతీయ సదస్సులో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో వర్చువల్ గా ప్రసంగించిన ఆయన, రాబోయే రోజుల్లో రోబోటిక్ సర్జరీ రంగంలో భారత్ అత్యంత కీలకమైన దేశంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ హెల్త్ తో పాటు సర్జికల్ రోబోటిక్స్ సేవల్లో భారత్ వేగంగా పురోగమిస్తోందని తెలిపారు. దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ-ఎన్సీఆర్ ఇప్పటికే రోబోటిక్ సర్జరీకి ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందిందని చెప్పారు.