Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

వన మహోత్సవంతో పచ్చదనానికి శ్రీకారం

వర్దన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి

వన మహోత్సవంతో పచ్చదనానికి శ్రీకారం
Share Short Clip Download PDF

వర్ధన్నపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఘనంగా ప్రారంభించారు. మంగళవారం రోజున మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్మన్ సారంగపాణి, మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలి, అప్పుడే పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుంది. వర్ధన్నపేటను పచ్చని వర్ధన్నపేటగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని పిలుపునిచ్చారు.
మొక్కలు నాటడం మాత్రమే కాదు, నాటిన ప్రతి మొక్కను బతికించే బాధ్యత మున్సిపల్ సిబ్బందిదే. ప్రతి మొక్కకు ట్రీ గార్డ్ ఏర్పాటు చేసి, రోజూ నీరు పోసేలా చర్యలు తీసుకుంటాం అని ఆయన హామీ ఇచ్చారు.

ప్రజల భాగస్వామ్యం :

ప్రతి ఇంటికి రెండు మొక్కల చొప్పున పంపిణీ చేస్తామని, ప్రజలు కూడా తమ ఇళ్లలో, ఆవరణలో మొక్కలు నాటి హరితహారంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నేతావత్ శిభారాణి, మున్సిపల్ ఇన్‌చార్జి కమీషనర్ కమ్మం కృష్ణ, వార్డు కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు ఈగ దామోదర్, మండల అధ్యక్షులు పోశాల వెంకన్న, నాయకులు సమ్మెట సుధీర్, తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణ, నేతావత్ రాజేందర్, ఎం.డి. అప్సర్, తిరుపెల్లి కుమారస్వామి, నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

వనమహోత్సవంతో పచ్చదనానికి శ్రీకారం