దుగ్గొండి మండలం శివాజీ నగర్ గ్రామంలో మహిళలకు యువ పరివర్తన సంస్థ కీరవాడి సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత కుట్టు మిషన్ సర్టిఫికెట్లను సర్పంచ్ సుకినే నాగరాజు మహిళలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి వార్డు మెంబర్లు యువ పరివర్తన సంస్థ నర్సంపేట మేనేజర్ పాల్గొన్నారు.
కుట్టు మిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సర్పంచ్ సుకినే నాగరాజు