తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పొనకల్ గ్రామంలో ఘనంగా జరిగింది. నాచినపల్లి పిఎసిఎస్ చైర్మన్ చెన్నూరు కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకువచ్చిందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొనకల్ గ్రామ సర్పంచ్ గుండె రాజేందర్, బిక్కాజిపల్లి గ్రామ సర్పంచ్ అంబరగొండ రాజేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్లు మట్ట రమేష్, దారు నారాయణ, పోకేటి రాజిరెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి, రేషన్ డీలర్ భోగి సునీత తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులు కొత్త స్మార్ట్ కార్డులు అందుకున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.