Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జాతీయం

రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత

రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత
Share Short Clip Download PDF

అభివృద్ధికి రహదారులే కీలకమని, ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం, బలమైన అనుసంధానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

అభివృద్ధికి రహదారులే కీలకమని, ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం, బలమైన అనుసంధానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్‌హెచ్‌-26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్తవలస వరకు 8 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.4.43 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను చేపట్టనున్నారు. రహదారి నిర్మాణం పూర్తయితే పరిసర ప్రాంతాల్లోని పలు గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రజల ప్రయాణ ఇబ్బందులను తగ్గించడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.

Source / reference: SHABD,Paravathipuram, August 28,