నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలకు చెందిన నలుగురు యువకులు రష్యా సైన్యంలో చిక్కుకున్నారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మా వారిని భారత దేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. రష్యాలోని మాస్కో నగరంలో 6 నెలల క్రితం హెల్పర్ పని పై ఏజెంట్ కి మూడు లక్షలు ఇచ్చి నిజామాబాద్ జిల్లా కు చెందిన భూక్యా రవీందర్,అశోక్, మెగవత్ ప్రకాశ్, కామారెడ్డి జిల్లాకు చెందిన మహమ్మద్ అఫ్జల్ ఖాన్ వెళ్ళారు. వెళ్ళిన కంపెనీలో ఆరు నెలలకే పని పూర్తి అయి పని లేకపోవడంతో మిలిటరీ క్యాంప్ లో గార్డెన్ లొ క్లీనర్ పని ఉంది 2 లక్షల జీతం అని వ్రాసి ఉన్న వాల్ పోస్టర్ ను చూసి యువకులు ఫోన్ చేశారు. అవును మిలటరీ క్యాంప్ లో గార్డెన్ క్లీనర్ పని ఉంది అని ఏజెంట్ చెప్పాడు. సరే అని యువకులు ఏజెంట్ ద్వారా మిలట్రీ క్యాంప్ కు వెళ్ళారు. అక్కడ నుండి అధికారులు మిలటరీ వాహనంలో 12 గంటల పాటు సరైన తిండి ఇవ్వకుండా యువకులను అడవిలో దించారు. ఆయుధాలు ఇచ్చి మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వగా మాతో కాదు గార్డెన్ క్లీనర్ పనికి వచ్చామని చెప్పగా యువకులను చితక బాది మరి మిలటరీ ట్రైనింగ్ ఇస్తున్నారని ట్రైనింగ్ ఇచ్చి ఉక్రెయిన్ బోర్డర్ లో పంపుతున్నట్లు మేము యుద్ధంలో చనిపోతామని మమ్మల్ని రక్షించాలని వీడియో రికార్డింగ్ లు యువకులు ఇంటికి పంపించారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మా వారినీ భారత దేశానికి రప్పించాలని వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.