కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న వారం రోజుల కార్యశాలలో భాగంగా రెండో రోజు శిక్షణ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ కంప్యూటర్ సెంటర్‌లో నిర్వహించారు. “సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ అండ్ అల్లైడ్ డిసిప్లిన్స్” సమన్వయకులు ఆచార్య ఎన్. ప్రసాద్, అదనపు సమన్వయకులు డాక్టర్ టి. శాస్త్రి ఆధ్వర్యంలో ఈ కార్యశాల కొనసాగుతోంది. రెండో రోజు శిక్షణలో స్మాల్ మాలిక్యూల్ డాకింగ్, వర్చువల్ లిగాండ్ స్క్రీనింగ్ (VLS), పెప్టైడ్ డాకింగ్ వంటి ఆధునిక కంప్యూటేషనల్ డ్రగ్ డిజైన్ (CADD) అంశాలపై పరిశోధక విద్యార్థులకు శిక్షణ అందించారు. అలాగే మాలిక్యులర్ డైనమిక్స్ సిమ్యులేషన్, అదనపు స్టాక్ (ADMET/physicochemical property) లెక్కింపుల విధానాలను ప్రదర్శన ద్వారా వివరించారు.
ఈ శిక్షణను పుణేకు చెందిన అడ్వెంట్ ఇన్ఫర్మాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన విషయ నిపుణులు డాక్టర్ దీపక్ శర్మ, డాక్టర్ షంషేర్ సింగ్ నిర్వహించారు. పరిశోధనలో సాఫ్ట్‌వేర్ వినియోగం ద్వారా ఫలితాల కచ్చితత్వంతో పాటు సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని వారు పేర్కొన్నారు. పరిశోధక విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను ప్రయోగాత్మకంగా, కంప్యూటర్ ఆధారితంగా వినియోగించేలా శిక్షణ అందించారు. ఈ కార్యశాల ఆగస్టు 22వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
కంప్యూటర్ విద్య పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి