మేడ్చల్-మల్కాజిగిరి(రైట్స్ మీడియా): తెలంగాణ వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, 3వ వార్డు సిక్ విలేజ్‌లో చాకలి ఐలమ్మ విగ్రహానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పింపించారు.
తెలంగాణ వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి
⏩మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
ఈ సందర్భంగా.. నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన సాహసోపేత పోరాటాన్ని స్మరించుకున్నారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్, మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్, జిల్లా దిశా కమిటీ సభ్యులు పరశురామ్, మాజీ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షులు సదా కేశవ రెడ్డి, బి.ఎన్. శ్రీనివాస్, కంటోన్మెంట్ అసెంబ్లీ కన్వీనర్ విజయానంద్, 3వ వార్డు అధ్యక్షులు అరుణ్, పలువురు రజక సంఘం నాయకులు, పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.