మరిపెడ (రైట్స్ మీడియా): మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన అలువాల గంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉండగా, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా రూ.3,00,000 విలువైన ఎల్‌ఓసీ మంజూరైంది. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ చొరవతో ఈ ఆర్థిక సహాయం మంజూరైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు వైద్యపరంగా అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్‌కు గంగమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.