గణేష్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక తనిఖీలు, విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ములుగు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి.బిక్షపతి స్పష్టం చేశారు.
ఈ నెల 14న వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటు, విద్యుత్ అలంకరణలు, విగ్రహాల తరలింపు, నిమజ్జనం సమయంలో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రజలు, భక్తులు, మండప నిర్వాహకులు, విద్యుత్ ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
“పండుగ వేడుకల్లో ఆనందం ఎంత ముఖ్యమో, ప్రతి ఒక్కరి ప్రాణ భద్రత అంతకంటే ముఖ్యం. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉన్నందున విద్యుత్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి” అని ఎస్ఈ స్పష్టం చేశారు.