Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ఆర్ధికభివృద్ధి సాధించడానికి విద్య ఒక శక్తివంతమైన సాధనం

ఆర్ధికభివృద్ధి సాధించడానికి విద్య ఒక శక్తివంతమైన సాధనం
Share Short Clip Download PDF

ఆర్ధికభివృద్ధి సాధించడానికి విద్య ఒక శక్తివంతమైన సాధనమని కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు గడ్డం భాస్కర్ అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ ఆర్ధికశాస్త్రం విభాగంలో తన పర్యవేక్షణ లో పరిశోధన చేసిన విద్యార్థిని డాక్టర్ గొర్రె డెబోరా కృపారాణి తన సిద్ధాంత గ్రంథమైన Equity and Growth – An Analytical Study of Telangana’ పుస్తకాన్ని కాకతీయ యూనివర్సిటీ వీసి ఆచార్యులు ప్రతాప్ రెడ్డి ఆధ్వరంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విశ్రాంత ఆచార్యులు గడ్డం భాస్కర్ మాట్లాడుతూ

ఆర్థికాభివృద్ధిని సాధించడానికి విద్య ఒక శక్తివంతమైన సాధనం అని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ టెక్నాలజీ ద్వారా విద్యను మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలకు సైతం అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని పుస్తకంలో విశ్లేషించినట్లు తెలిపారు. భవిష్యత్ తరాలు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు విద్యారంగానికి తగినంత బడ్జెట్ కేటాయించడంతో పాటు, నిధుల వినియోగం మరియు విద్యా ఫలితాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఉందని పుస్తకం సూచిస్తుందని తెలిపారు. అలాగే విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల కమిటీలు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు భాగస్వాములు కావాల్సిన అవసరాన్ని కూడా పుస్తకం ప్రతిపాదిస్తుందని పేర్కొన్నారు. విద్య, సమానత్వం, ఆర్థికాభివృద్ధి మధ్య ఉన్న పరస్పర సంబంధాలను తెలంగాణ రాష్ట్రం నేపథ్యంలో విశ్లేషించిన ఈ పుస్తకం విద్యా రంగం, సామాజికాభివృద్ధి, విధాన నిర్ణేతలకు ఉపయోగకరమైన అంశాలను అందిస్తుందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. పుస్తక రచయిత డా. గొర్రె డెబోరా కృపా రాణిని ఉపకులపతి అభినందించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, ఓఎస్డీ ఆచార్య బి. వెంకట్రామ్ రెడ్డి, సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీ డీన్ ఆచార్య బి. సురేష్ లాల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు డా. చిర్రా రాజు, శ్రీ పుల్లూరి సుధాకర్, ఏసీబీ సి. ప్రతాప్, శ్రీ సామల దయాకర్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ పి. రామ్ రెడ్డి, రిటైర్డ్ లెక్చరర్ పి. అశోక్, ఏడీఈ అనగంటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.