నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు నేరాల నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డ్రోన్ నిఘాను నిర్వహిస్తున్నారు. పట్టణ, గ్రామ శివారు, సముద్ర తీర ప్రాంతాలలో ఆధునిక డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో జూదం, మద్యం సేవించడం తదితర నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి డ్రోన్ పర్యవేక్షణను మరింత విస్తృతంగా అమలు చేస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.