కాకతీయ విశ్వవిద్యాలయం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం పాఠ్య ప్రణాళిక అధ్యక్షుడిగా కొత్తగూడెం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ వి. రాము నియమించినట్లు కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేయూ వీసి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం డాక్టర్ వి. రాము నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం మూడు సంవత్సరాల కాలానికి అమలులో ఉంటుందని తెలిపారు.
డాక్టర్ వి. రాము ప్రస్తుత పాఠ్య ప్రణాళిక అధ్యక్షురాలు డాక్టర్ కే. సుమలత నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు డాక్టర్ వి. రామును అభినందించారు.
కేయూ ఇంజనీరింగ్ పాఠ్య ప్రణాళిక అధ్యక్షుడిగా డాక్టర్ వి.రాము