Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

సురక్షిత సిద్దిపేట లక్ష్యంగా మహిళా భద్రత, సైబర్ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి

సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్.

సురక్షిత సిద్దిపేట లక్ష్యంగా మహిళా భద్రత, సైబర్ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి
Share Short Clip Download PDF

సిద్దిపేట మహిళా పోలీస్ స్టేషన్ అధికారులతో మరియు సిబ్బందితో సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, శనివారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో వ్యవహరించే తీరు, అవగాహన కార్యక్రమాలు, మహిళా రక్షణ చర్యలపై సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.

సమావేశంలో సీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ..

పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులు మరియు వారి కౌన్సెలర్లతో ఎంతో శాంతంగా, ఓర్పుతో మాట్లాడాలి. సమస్యలను సమగ్రంగా విని, ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి సాధ్యమైనంత వరకు సమస్యలను సజావుగా పరిష్కరించేలా చొరవ చూపాలి. విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు నాణ్యమైన అవగాహన కార్యక్రమాలను పాఠశాలలు మరియు కళాశాలల్లో క్రమం తప్పకుండా నిర్వహించాలి. ప్రస్తుత డిజిటల్ యుగంలో మహిళలు, యువతులు ఎదుర్కొంటున్న సైబర్ మార్ఫింగ్, సోషల్ మీడియా వేధింపులు మరియు ఆన్‌లైన్ మోసాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలి. అత్యవసర సమయాల్లో 112 హెల్ప్‌లైన్ నంబర్ ప్రాముఖ్యత, మహిళా భద్రతా చట్టాలు పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి అని సూచించారు. క్విక్ రెస్పాన్స్ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులు, ఉద్యోగినులకు ప్రాథమిక ఆత్మరక్షణ నైపుణ్యాలను నేర్పించేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి. ప్రభావవంతమైన సమాజ అవగాహన కార్యక్రమాల ద్వారా మహిళలపై జరిగే అరాచకాలను అరికట్టి, సమాజంలో సానుకూల సామాజిక మార్పును తీసుకురావడమే ధ్యేయం కావాలి అని తెలిపారు.
ప్రజల్లో నమ్మకం పెంచేలా పోలీసింగ్ ఉండాలని, అందరూ కలిసికట్టుగా పనిచేసి 'సురక్షిత సిద్దిపేట' సాధనకు కృషి చేయాలని సీపీ రష్మి పెరుమాళ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ దుర్గా, భరోసా సిబ్బంది మరియు సిబ్బంది పాల్గొన్నారు.