వినాయక చవితిని పురస్కరించుకుని సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని గణనాథునికి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జిల్లా
సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలని, అభివృద్ధిలో మన జిల్లా ఆదర్శంగా నిలవాలని గణనాథుడికి పూజలు నిర్వహించారు. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో నవరాత్రులను నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల సిబ్బంది పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.