తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా 9 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో, కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిశాల రాజేందర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోడూరు శ్రీనివాస్ గౌడ్ కృషితో ఈ మంజూరు లభించాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ తాండ్ర శ్రీనివాస్, ఉపసర్పంచ్ వైద తిరుపతి, రాచమల్ల స్రవంతి-రాజిరెడ్డి, తాండ్ర కవిత-మహేందర్, మేడి మంగ-చంద్రయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు బత్తిని గణేష్, గ్రామ ప్రధాన కార్యదర్శి రాజకుమార్,ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు తాండ్ర తిరుపతి, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.