Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

హుజురాబాద్‌ పట్టణం పలు వార్డుల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

⏩రూ.4.35 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

హుజురాబాద్‌ పట్టణం పలు వార్డుల్లో సీఎంఆర్ఎఫ్  చెక్కుల పంపిణీ
Share Short Clip Download PDF

హుజురాబాద్(రైట్స్ మీడియా): అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు CMRF చెక్కులు అండగా నిలుస్తాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో CMRF ద్వారా మంజూరైన రూ.4,35,000 విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్యం, వైద్య ఖర్చులు పెద్ద భారంగా మారుతున్న పరిస్థితుల్లో CMRF ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వైద్య చికిత్స కోసం ఖర్చు చేసిన కుటుంబాలకు CMRF చెక్కుల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

CMRF చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమ వైద్య ఖర్చులకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో SC కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాండ శ్రీనివాస్, కౌన్సిలర్ గందె శ్రీనివాస్, నరేష్, నర్సారెడ్డి లావణ్య, మాజీ కౌన్సిలర్లు కోలిపాక శ్రీనివాస్, ఇమ్రాన్, రమేష్, శాంతన్ రెడ్డి, పూర్ణ చందర్, శ్రీనివాస్, ముత్యం రాజు, తిరుమల్ రెడ్డి , రమాదేవితో పాటు పలువురు BRS నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.