స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు, "ఖేలేగా భారత్ – జీతేగా భారత్" నినాదంతో ఆగస్టు 28 నుండి 30 వరకు నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు మహబూబాబాద్‌లోని టి.జి.ఎం.ఆర్.ఎస్ (TGMRS) బాలుర పాఠశాల–1లో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన & క్రీడల అధికారిణి డా. ఓ. జ్యోతి హాజరై, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.