Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

కార్పొరేట్ రంగంలో విజయానికి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎంతో కీలకం.....

టీ హబ్ ప్రతినిధి డాక్టర్ రాజేష్ పేర్షెడ్.

కార్పొరేట్ రంగంలో విజయానికి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎంతో కీలకం.....
Share Short Clip Download PDF

కార్పొరేట్ రంగంలో విజయానికి మర్యాదలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎంతో కీలకమని టి-హబ్ ప్రతినిధి డాక్టర్ రాజేష్ పెర్శేడ్ అన్నారు. మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయ సెనెట్ హాల్‌లో కే-హబ్ డైరెక్టర్ ఆచార్య టి. సవితా జ్యోత్స్న నేతృత్వంలో, రుసా 2.0 సహకారంతో ఎంపిక చేసిన విద్యార్థులకు నిర్వహిస్తున్న వ్యవస్థాపకత నైపుణ్యాల శిక్షణ కార్యక్రమం–4” లో భాగంగా డాక్టర్ రాజేష్ పెర్శేడ్ పాల్గొని “కార్పొరేట్ మర్యాదలు” అనే అంశంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో పాటు ప్రయోగాత్మకంగా శిక్షణ అందించారు.
21వ శతాబ్దంలో కార్పొరేట్ సంస్థలు ఆశిస్తున్న నైపుణ్యాలను విద్యార్థులు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అకాడమిక్ అర్హతలతో పాటు కమ్యూనికేషన్, సమస్య పరిష్కారం, సృజనాత్మక ఆలోచన, చురుకైన వినికిడి వంటి నైపుణ్యాలపై విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. సంస్థల్లో ఉద్యోగుల ప్రవర్తన, వృత్తిపరమైన మర్యాదలు, ఇతరులతో వ్యవహరించే విధానం వంటి అంశాలను ప్రయోగాత్మక ఉదాహరణలతో వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

విద్యార్థులతో పరస్పర చర్చ నిర్వహిస్తూ కమ్యూనికేషన్, సమస్య పరిష్కరణ, సృజనాత్మక ఆలోచన, వినికిడికి సంబంధించిన వివిధ పద్ధతులను వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కే-హబ్ డైరెక్టర్ ఆచార్య టి. సవితా జ్యోత్స్న మాట్లాడుతూ, కాకతీయ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన సుమారు 1,700 మంది విద్యార్థులను ప్రాథమిక ఎంపిక ప్రక్రియలో భాగస్వాములను చేసినట్లు తెలిపారు. వారిలో 400 మంది విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం 17 శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఎంపికైన 100 మంది విద్యార్థులతో వివిధ బృందాలను ఏర్పాటు చేసి, వారికి మరింత ఉన్నత స్థాయి శిక్షణ అందించడం ద్వారా 10 అంకుర సంస్థలను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రుసా నోడల్ అధికారి ఆచార్య ఆర్. మల్లికార్జున రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారని ఆమె తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా తదుపరి రోజు కూడా మరో అంశంపై నిపుణులతో శిక్షణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కే-హబ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సిద్ధార్థ, డాక్టర్ బొల్లం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.