Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
ప్రత్యేక కథనాలు

గుజరాత్ లోని ఏక్తానగర్ లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం: అవార్డులు అందచేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

🎬యువత తమకు ఆదర్శంగా పరిగణించే సినీ తారలు వారిలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాలని, హానికరమైన పదార్థాల ప్రచారాలకు దూరంగా ఉండాలని రాష్ట్రపతి పిలుపు.

గుజరాత్ లోని ఏక్తానగర్ లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం: అవార్డులు అందచేసిన రాష్ట్రపతి  ద్రౌపదీ ముర్ము
(భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు అనంత్‌ నాగ్‌.. )
Share Short Clip Download PDF

🏆దేశవ్యాప్తంగా తనపై అపారమైన ప్రేమ చూపుతున్న అసంఖ్యాక అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన తెలిపిన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత అనంత్‌ నాగ్‌.

👏 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం నిర్వహణ ద్వారా భారత్‌ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటుతాం | 2027 అక్టోబర్‌లో తదుపరి విడత వేవ్స్: కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను మంగళవారం ప్రదానం చేశారు. ప్రతిభ, అంకితభావం, కృషితో అవార్డులు అందుకున్న విజేతలందరికీ అభినందనలు తెలిపారు. సినిమా నిర్మాణం సమష్టి కృషితో కూడుకున్నదని, అవార్డు గ్రహీతలు తమకు అవార్డులు తెచ్చిపెట్టిన చిత్రాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ప్రతి సభ్యుడికి అభినందనలు తెలియజేయాలని రాష్ట్రపతి కోరారు.

నాటక, చలనచిత్ర రంగాలకు విశిష్ట సేవలు అందించిన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత అనంత్‌ నాగ్‌కు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు.

భారతీయ చలనచిత్ర రంగం దేశంలోని విభిన్న భాషలు, సంప్రదాయాలు, ఆకాంక్షలు, ఉద్యమాలను ప్రతిబింబిస్తుందని రాష్ట్రపతి అన్నారు. జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి ఏక్తా నగర్‌ను వేదికగా ఎంపిక చేయడాన్ని ఆమె అభినందించారు. ఇది భారత సాంస్కృతిక, జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.

సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో గౌరవం, సామాజిక భద్రత అవసరమని, కార్మికులు, చిన్న కళాకారులు, సహాయకులు, సృజనాత్మక రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ గౌరవం, సామాజిక భద్రతకు అర్హులని రాష్ట్రపతి అన్నారు. సమగ్ర మానవీయ దృక్పథం ప్రతిబింబించేలా అన్ని జ్యూరీల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు.

ప్రజాదరణ పొందిన కళాకారులు పిల్లలు, యువతను ప్రభావితం చేయగలరని, అందుచేత సక్సెస్ సాధించిన కళాకారులు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ప్రయోజనాలను యువతలో ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను ప్రచారం చేయడం లేదా వాటిని సమర్థించడం వంటి వాటికి దూరంగా ఉండాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.

దేశంలో నిర్మిస్తున్న చిత్రాల నాణ్యత భారతీయ చలనచిత్ర రంగం ప్రపంచస్థాయి ప్రమాణాలను నెలకొల్పగలదన్న తన విశ్వాసాన్ని మరింత బలపరుస్తోందని రాష్ట్రపతి అన్నారు.

కథలతో సాగిన జీవిత ప్రయాణం.. సినీ రంగానికి చిరస్మరణీయ వారసత్వం: అనంత్‌ నాగ్‌ కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం

అనంత్ నాగ్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024ను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదానం చేసిన క్షణం... కథాంశాలు, నాటకం, సినిమా పట్ల ఆయన జీవితకాల అంకితభావాన్ని ఆవిష్కరించింది. దశాబ్దాలుగా భారతీయ సినిమాలో ఆయన నటన, నిరంతర సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది.

వినయపూర్వకంగా అవార్డును స్వీకరించిన అనంత్‌ నాగ్‌, తన సినీ ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన ప్రజలకు, పొందిన అనుభవాలకు కృతజ్ఞతలు తెలిపారు.

తన తొలినాళ్లను గుర్తుచేసుకున్న అనంత్‌ నాగ్‌, ముంబైకి రాక ముందు తాను ఒక ఆశ్రమంలో పెరిగానని తెలిపారు. ముంబై చేరాకా అక్కడ ఒక నాటకంలో నటించే అవకాశం లభించిందన్నారు. నాటక రంగమే తన నటనా ప్రస్థానానికి పునాదిగా నిలిచిందని, సినిమాల్లోకి ప్రవేశించకముందు సుమారు 50 నాటకాల్లో నటించానని చెప్పారు. అనంతరం చలనచిత్రాల్లో నటించే అవకాశం లభించిందని, ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ తెరకెక్కించిన చిత్రాల్లోనూ పనిచేసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు.

పూర్తి విజ్ఞతతోనే తాను కన్నడ సినిమాను ఎంచుకుని, బెంగళూరును తన కర్మభూమిగా చేసుకున్నానని అనంత్ నాగ్ తెలిపారు. గతేడాది గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్న ఆయన, ఈ ఏడాది కూడా రాష్ట్రపతి నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించినందుకు ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు.

కథలతో సాగిన జీవిత ప్రయాణం.. సినీ రంగానికి చిరస్మరణీయ వారసత్వం: అనంత్‌ నాగ్‌ కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం
The President, Smt. Droupadi Murmu confers the Dadasaheb Phalke Award to Actor Shri Anant Nag at the 72nd National Film Awards ceremony at Ekta Nagar (Kevadia) in Gujarat on September 22, 2026.

జాతీయ చలనచిత్ర అవార్డులకు గుజరాత్‌ ఆతిథ్యం

గుజరాత్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రస్థానంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

ఢిల్లీ వెలుపల జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ కృతజ్ఞతలు తెలిపారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ వారసత్వం, శక్తికి ప్రతీకగా నిలిచిన ఏక్తా నగర్‌, కేవడియాలో ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం గుజరాత్‌కు గర్వకారణమని ఆయన అన్నారు.

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని ఉద్దేశించి గవర్నర్‌ మాట్లాడుతూ, దేశంలోని విభిన్న భాషలు, సంస్కృతులను సుసంపన్నం చేయడంలో భారత చలనచిత్ర రంగం విశేషంగా దోహదపడిందన్నారు. ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యకరమైన జీవనశైలి, పర్యావరణ స్పృహను ప్రోత్సహించేందుకు, ప్రేమ, సోదరభావం, జాతీయ ఐక్యత విలువలను మరింత బలోపేతం చేసేందుకు సినిమాను సాధనంగా ఉపయోగించాలని ఆయన చిత్ర నిర్మాతలకు పిలుపునిచ్చారు.

గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ మాట్లాడుతూ, 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్రపతికి, ప్రముఖ అతిథులకు స్వాగతం పలికారు. ఏక్తా నగర్‌లో ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

సినిమా సమాజానికి అద్దం పడుతుందని, సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే సాధనంగా, మానవ భావోద్వేగాలను అనుసంధానించే శక్తివంతమైన మాధ్యమంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్‌ గుర్తింపును, సాఫ్ట్‌ పవర్‌ను మరింత బలోపేతం చేసే సామర్థ్యం సినిమాకు ఉందని ఆయన అన్నారు.

గుజరాత్‌ లోని గొప్ప వారసత్వ సంపద, వైవిధ్యభరితమైన ప్రకృతి దృశ్యాలు, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రస్తావించిన ఆయన, భారతీయ, అంతర్జాతీయ చిత్రనిర్మాతలు తమ చిత్రీకరణలకు గుజరాత్‌ను ఎంచుకోవాలని ఆహ్వానించారు. ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఏక్తా నగర్‌, కేవడియాలో జరిగిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి హాజరై కార్యక్రమానికి వన్నె తెచ్చిన రాష్ట్రపతికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ చలనచిత్ర రంగంలో విశిష్ట విజయాలు సాధించిన అవార్డు విజేతలందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

సినిమా వెనక సమష్టి కృషి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ చలనచిత్ర అవార్డులు తెరపై కనిపించే అవార్డు గ్రహీతలతో పాటు, తెరవెనుక పనిచేసే సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బంది సేవలను కూడా గుర్తిస్తున్నాయని ఆయన అన్నారు. భారతీయ చలనచిత్ర రంగానికి అపారమైన సేవలు అందించిన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత అనంత్‌ నాగ్‌ను ఆయన ప్రశంసించారు.

జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో నిర్వహించడం ద్వారా భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. భవిష్యత్తులో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలను వేదికలుగా ప్రతిపాదించాలని ఆయన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ టెక్నాలజీస్‌ ను కొత్త ప్రతిభా వనరుగా ప్రస్తావించిన ఆయన, ఇప్పటికే 13 కోర్సుల్లో సుమారు 380 మంది విద్యార్థులు ప్రవేశం పొందారని తెలిపారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా, పరిశ్రమ భాగస్వామ్యంతోనే ఈ కోర్సుల పాఠ్య ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 15,000 క్రియేటివ్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రధానమంత్రి ఆమోదం తెలిపారని ఆయన వెల్లడించారు. తద్వారా యువత అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను నేర్చుకోవడంతో పాటు, భారత్‌లోని వైవిధ్యభరితమైన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు.

చిన్న పట్టణాల్లోని నైపుణ్యాలను గుర్తించి, తీర్చిదిద్ది, ప్రోత్సహించడంలో ప్రసార భారతి ఛైర్మన్ శ్రీ ప్రసూర్ జోషితో పాటు చలనచిత్ర నిర్మాతలు, మొత్తం సినీ పరిశ్రమ ముందుకు రావాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.

ప్రభుత్వం, సృజనాత్మక రంగం సమష్టి కృషి ద్వారా భారత్‌లోని అపారమైన సృజనాత్మక సామర్థ్యాన్ని వెలికితీయడంతో పాటు, భారతీయ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరేలా చేయవచ్చని ఆయన పునరుద్ఘాటించారు.

వచ్చే ఏడాది అక్టోబర్‌లో నిర్వహించనున్న వేవ్స్‌ - 2027కు సంబంధించి సూచనలు, ఆలోచనలను అందించాలని ఆయన ఆహ్వానించారు.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి చంచల్‌ కుమార్‌ మాట్లాడుతూ, 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కోసం 34 భాషల్లో రూపొందిన 400 ఫీచర్‌ చిత్రాలు, 24 భాషల్లో రూపొందిన 161 నాన్‌ - ఫీచర్‌ చిత్రాలు అందాయని తెలిపారు. వీటిలో 22 ఫీచర్‌ చిత్రాలకు, 23 నాన్‌ - ఫీచర్‌ చిత్రాలకు అవార్డులు ప్రదానం చేసినట్లు చెప్పారు. సాంస్కృతిక వ్యక్తీకరణకు, ప్రపంచస్థాయి కథనాలకు భారతీయ చలనచిత్ర రంగం శక్తివంతమైన మాధ్యమంగా నిరంతరం విస్తరిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీ వెలుపల ఏక్తా నగర్‌లో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించడం సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ ఐక్యతపై కలలుగన్న దృక్పథం, నిబద్ధత నుంచి స్ఫూర్తి పొందిన కీలక కార్యక్రమమని ఆయన తెలిపారు. రానున్న సంవత్సరాల్లో ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఇతర నగరాల్లోనూ నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

జాతీయ చలనచిత్ర అవార్డులకు గుజరాత్‌ ఆతిథ్యం
The President of India, Smt Droupadi Murmu confers the award for "Best Gujarati Film (Maaran)" "Producer: Cineman Productions Limited Rep: Shri Amit Desai" Rajat at the 72nd National Film Awards ceremony at Ekta Nagar (Kevadia), in Gujarat on September 22, 2026.

ప్రతిభకు పట్టం.. కథలు, నటన, భారతీయ సినిమా వైవిధ్య ఛాయల వేడుక

ఉత్తమ నటుడు అవార్డును ‘భ్రమయుగం’ చిత్రానికి మమ్ముట్టి, ‘చందు ఛాంపియన్‌’ చిత్రానికి కార్తిక్‌ ఆర్యన్‌ సంయుక్తంగా అందుకున్నారు. ‘ఆర్టికల్‌ 370’ చిత్రంలో నటనకు యామీ గౌతమ్‌ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.

సహాయ పాత్రల విభాగంలో ‘భక్షక్‌’ చిత్రానికి సంజయ్‌ మిశ్రా ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకున్నారు. ‘మహారాజా’ చిత్రానికి సచనా నామిదాస్‌, ‘మిథ్యా’ చిత్రానికి రూపశ్రీ వర్కడీ సంయుక్తంగా ఉత్తమ సహాయ నటి అవార్డును అందుకున్నారు.

‘ఆర్టికల్‌ 370’ ఉత్తమ చలనచిత్రంగా అవార్డు అందుకుంది. ‘స్వాతంత్ర్య వీర్‌ సావర్కర్‌’ చిత్రంతో దర్శకత్వ రంగంలో అరంగేట్రం చేసిన రణ్‌దీప్‌ హుడాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ ఎంపికైంది. జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ప్రోత్సహించే ఉత్తమ చలనచిత్ర అవార్డును ‘కెప్టెన్‌ మిల్లర్‌’ అందుకుంది. ‘అమరన్‌’ చిత్రానికి రాజ్‌కుమార్‌ పెరియసామి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు.

ప్రతిభకు పట్టం.. కథలు, నటన, భారతీయ సినిమా వైవిధ్య ఛాయల వేడుక
The President of India, Smt Droupadi Murmu confers the award for Best screenplay Writer (Original)Pushpa - The Rule Part 2 (Telugu)Screenplay Writer: Shri Bandreddi Sukumar Rajat at the 72nd National Film Awards ceremony at Ekta Nagar (Kevadia), in Gujarat on September 22, 2026.

అనేక భాషలు.. ఒకే జాతీయ వేదిక

భారతీయ చలనచిత్ర రంగంలోని భాషా వైవిధ్యాన్ని కూడా ఈ అవార్డులు చాటిచెప్పాయి. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న భాషలకు అదనంగా గఢ్వాలీ, తుళు భాషల చిత్రాలకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

ఎస్‌సీ ఫార్మాకెమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మించిన, దినేశ్‌ పి. భోంస్లే దర్శకత్వం వహించిన ‘ధోలీ’ చిత్రానికి ఉత్తమ గఢ్వాలీ చిత్రంగా అవార్డు లభించింది. పిచ్చర్‌ స్టూడియో నిర్మించిన, శివధ్వజ్‌ శెట్టి దర్శకత్వం వహించిన ‘ఇంబు’ చిత్రానికి ఉత్తమ తుళు చిత్రంగా అవార్డు లభించింది.

రవి రాజ్‌ ముర్ము దర్శకత్వం వహించిన సంతాలీ చిత్రం ‘అంగెన్‌’కు ఉత్తమ తొలి చిత్రం (దర్శకుడు) అవార్డు లభించింది.

గఢ్వాలీ, తుళు నుంచి సంతాలీ వరకు.. ఈ కార్యక్రమం విభిన్న భాషల చలనచిత్ర స్వరాలను ఒకే జాతీయ వేదికపైకి తీసుకువచ్చింది. ప్రతి భాష భారతీయ చలనచిత్ర రంగంలో కొత్త కథను జోడిస్తుందన్న విషయాన్ని ఈ వేడుక మరోసారి చాటిచెప్పింది.

అనేక భాషలు.. ఒకే జాతీయ వేదిక
The President of India, Smt Droupadi Murmu confers the award for "Best Hindi Film (Srikanth)" Director: Shri Tushar Hiranandani Rajat at the 72nd National Film Awards ceremony at Ekta Nagar (Kevadia), in Gujarat on September 22, 2026.
గుజరాత్ లోని ఏక్తానగర్ లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం: అవార్డులు అందచేసిన రాష్ట్రపతి  ద్రౌపదీ ముర్ము
The President of India, Smt Droupadi Murmu confers the award for "Best Kannada Film (Mithya)" Director: Shri Sumanth Bhat Rajat at the 72nd National Film Awards ceremony at Ekta Nagar (Kevadia), in Gujarat on September 22, 2026.
గుజరాత్ లోని ఏక్తానగర్ లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం: అవార్డులు అందచేసిన రాష్ట్రపతి  ద్రౌపదీ ముర్ము
The President of India, Smt Droupadi Murmu confers the award for "Best Film Critic (Hindi)" Critic: Shri Sanjeev Shrivastava Swarna at the 72nd National Film Awards ceremony at Ekta Nagar (Kevadia), in Gujarat on September 22, 2026.
గుజరాత్ లోని ఏక్తానగర్ లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం: అవార్డులు అందచేసిన రాష్ట్రపతి  ద్రౌపదీ ముర్ము
The President of India, Smt Droupadi Murmu confers the award for “Best Script Obur (Hindi & Kashmiri)" Script Writer: Shri Faraz Ali Rajat at the 72nd National Film Awards ceremony at Ekta Nagar (Kevadia), in Gujarat on September 22, 2026.
గుజరాత్ లోని ఏక్తానగర్ లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం: అవార్డులు అందచేసిన రాష్ట్రపతి  ద్రౌపదీ ముర్ము
The President of India, Smt Droupadi Murmu confers the award for "Best Feature Film Article 370 (Hindi) Producer: Jio Studios & B62 Studios Rep: Shri Aditya Dhar Swarna at the 72nd National Film Awards ceremony at Ekta Nagar (Kevadia), in Gujarat on September 22, 2026.
గుజరాత్ లోని ఏక్తానగర్ లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం: అవార్డులు అందచేసిన రాష్ట్రపతి  ద్రౌపదీ ముర్ము
The President of India, Smt Droupadi Murmu confers the award for Best Cinematography Bramayugam (Malayalam) Cinematographer : Shri Shehnad Jalal Rajat at the 72nd National Film Awards ceremony at Ekta Nagar (Kevadia), in Gujarat on September 22, 2026.
గుజరాత్ లోని ఏక్తానగర్ లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం: అవార్డులు అందచేసిన రాష్ట్రపతి  ద్రౌపదీ ముర్ము
The President of India, Smt Droupadi Murmu confers the award for "Best Debut Film of a Director Swatantrya Veer Savarkar (Hindi) Director: Shri Randeep Hooda Swarna at the 72nd National Film Awards ceremony at Ekta Nagar (Kevadia), in Gujarat on September 22, 2026.
గుజరాత్ లోని ఏక్తానగర్ లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం: అవార్డులు అందచేసిన రాష్ట్రపతి  ద్రౌపదీ ముర్ము
The President of India, Smt Droupadi Murmu confers the award for "Best Documentary Ram-Nami (Hindi)" "Producer: B.B.P. Studio Virtual Bharat Pvt. Ltd. Rep: Ms. Lynette Dmello" Rajat at the 72nd National Film Awards ceremony at Ekta Nagar (Kevadia), in Gujarat on September 22, 2026.
గుజరాత్ లోని ఏక్తానగర్ లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం: అవార్డులు అందచేసిన రాష్ట్రపతి  ద్రౌపదీ ముర్ము
The President of India, Smt Droupadi Murmu confers the award for "Best Actress in a Supporting Role Maharaja (Tamil) Supporting Actress: Ms. Sachana Namidass Rajat at the 72nd National Film Awards ceremony at Ekta Nagar (Kevadia), in Gujarat on September 22, 2026.
గుజరాత్ లోని ఏక్తానగర్ లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం: అవార్డులు అందచేసిన రాష్ట్రపతి  ద్రౌపదీ ముర్ము
The President of India, Smt Droupadi Murmu confers the award for "Best Actor in a Supporting Role Bhakshak (Hindi) Supporting Actor: Shri Sanjay Mishra Rajat at the 72nd National Film Awards ceremony at Ekta Nagar (Kevadia), in Gujarat on September 22, 2026.
గుజరాత్ లోని ఏక్తానగర్ లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం: అవార్డులు అందచేసిన రాష్ట్రపతి  ద్రౌపదీ ముర్ము
The President of India, Smt Droupadi Murmu confers the award for "Best Biographical / Historical Reconstruction / Compilation Film Kakori (Hindi)" "Producer: KSR Brothers & Minti Mishra Rep: Shri Jaswinder Singh" Rajat at the 72nd National Film Awards ceremony at Ekta Nagar (Kevadia), in Gujarat on September 22, 2026.
📄 పురస్కార గ్రహీతల పూర్తి జాబితా, అవార్డులకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం Complete List of Awardees పై క్లిక్‌ చేయండి.

Source / reference: PIB India | PIB Hyderabad, September 22, 2026.