వరంగల్, అక్టోబర్ 6(రైట్స్ మీడియా): జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అడ్మినిస్ట్రేషన్ విభాగాలతో పాటు రికార్డు రూమ్, ల్యాబ్, వివిధ విభాగాలను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లోని అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్, ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన అధికారులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంజీఎం అడ్మినిస్ట్రేషన్ అధికారిని స్పష్టంగా ఆదేశించారు. అధికారులు, సిబ్బంది విధులకు క్రమం తప్పకుండా హాజరై తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రికార్డు రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్, రికార్డులను క్రమబద్ధంగా భద్రపరచడంతో పాటు రికార్డు రూమ్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.