Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జాతీయం

ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆర్టీజీఎస్ పై  సీఎం చంద్రబాబు సమీక్ష
Share Short Clip Download PDF

ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అందుతున్న పౌరసేవలు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పథకాల అమలులో పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.