విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే విఘ్నేశ్వరుని అనుగ్రహంతో జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌ పాయి ఆకాంక్షించారు.

వినాయక చవితి సందర్భంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని కోరారు.

సోమవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్ తెలిపారు.