హైదరాబాద్ (రైట్స్ మీడియా): జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాపూ ఘాట్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియంను గవర్నర్ తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.
అలాగే, ప్రభుత్వ సలహాదారులు వీ హనుమంత రావు, హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.