నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాజేంద్ర చౌరస్తాకు సమీపంలోని ఓ థియేటర్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్ సమీపంలో కూరగాయలు అమ్మే ప్రాంతానికి వచ్చి, అక్కడ హరిబాబు అనే వ్యక్తిని తమతో తెచ్చుకున్న కొబ్బరికాయలు కోసే కత్తితో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులతో సమాచారం తెలుసుకున్న రెండో టౌన్ ఎస్ హెచ్ఓ యాదగిరి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించారు. ఏసీపీ ప్రకాశ్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వైష్ణవి హత్య కక్ష్యలో భాగంగా హరిబాబును హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సమగ్ర విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యువకుడి దారుణ హత్య...
⏩యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన హరిబాబు గా గుర్తింపు...?
News URL: https://rightsmedia.in/news/brutal-murder-of-a-young-man-in-nizamabad-district-headquarters