ఒడిశాలోని బొలాంగీర్ జిల్లాలో ఆగస్టు 18న సంతోష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రధాన నిందితుడు శత్రుఘ్న సాహూ, సహచరులు కలిసి అతన్ని భోజనానికి పిలిచి, నిద్రపోయాక హత్య చేశారు. అనంతరం తలను మొండెం నుంచి వేరు చేసి, గ్రామం వెలుపలి చెరువులో మృతదేహాన్ని పడేశారు. తెగిపోయిన తలను సాహూ ఇంట్లోని పూజా గదిలో దాచినట్లు పోలీసులు గుర్తించారు. భార్యను తిరిగి తెచ్చుకోవాలనే మూఢనమ్మకంతో నరబలికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో సాహూతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు.
భోజనానికి పిలిచి దారుణ హత్య.. పూజా గదిలో తల దాచిన కిరాతకుడు